ప్రత్యర్థులపై కేసులు వేసే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు: కేటీఆర్

  • ప్రజలకు ఉపయోగపడే పనులు రేవంత్ చేయడం లేదన్న కేటీఆర్
  • మీడియాకు లీకులిస్తూ ప్రజలు దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శ
  • సాగునీటిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాలో కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రేవంత్‌రెడ్డి రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా, ప్రత్యర్థులపై కేసులు వేసే పనిలో మాత్రమే జోరుగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. మీడియాకు లీకులు ఇవ్వడం, నోటీసుల డ్రామాతో ప్రజల దృష్టిని వేరే దిశగా మళ్లించడం చేస్తున్నారని విమర్శించారు.


నదీ జలాలపై రేవంత్ కు ఏమాత్రం అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాగునీటిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని... రేవంత్ కు దమ్ముంటే సహకారసంఘాల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోవడం వల్లే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అన్నారు.



More Telugu News