అలా చేస్తే ఏపీలో ఏం జరిగిందో అందరూ చూశారు: నోటీసుల ప్రచారంపై హరీశ్ రావు

  • రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే ఏపీలో ఏం జరిగిందో చూశారని వ్యాఖ్య
  • ఇక్కడ కూడా అదే జరుగుతుందన్న హరీశ్ రావు
  • సీఎం కోసం అధికారులు అతి చెస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక
రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారని, తమను కావాలని ఇబ్బంది పెడితే ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనతో పాటు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.

ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు కేసులు కొత్తేమీ కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వాలని చెప్పారని తెలిసిందని పేర్కొన్నారు. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అధికారులు అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.



More Telugu News