డమ్మీ అయిపోయిన పాక్ ప్రధాని.. పాక్ ఆర్మీ చీఫ్ని కలిసిన అండర్-19 జట్టు!

  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్ లో పాక్ ఘన విజయం
  • చిత్తుగా ఓడిపోయిన భారత్
  • ప్రధానిని కాకుండా ఆర్మీ చీఫ్ ను కలిసిన పాక్ జట్టు

ఈనెల 21న జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు భారత్‌పై ఘన విజయం సాధించింది. భారత్ పై 191 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ సమీర్ అద్భుత ప్రదర్శనతో 113 బంతుల్లో 172 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 348 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది.


విజయం అనంతరం పాక్ జట్టు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను కలిసింది. మునీర్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మెహ్సిన్ నఖ్వీ జట్టు సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారితో పాటు పాక్ జట్టు మెంటార్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఉన్నారు. ఘన విజయం సాధించిన పాక్ జట్టును ఆసిమ్ మునీర్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు తమ ప్రతిభ, క్రమశిక్షణ, సమష్టి కృషితో దేశానికి పేరు తెచ్చారని కితాబునిచ్చారు. ఈ విజయం కేవలం క్రికెట్ రంగానికే కాకుండా, పాకిస్థాన్ దేశానికి గర్వకారణమని మునీర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.


మరోవైపు పాక్ జట్టు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కాకుండా ఆర్మీ చీఫ్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పాక్ ప్రధాని డమ్మీ అయిపోయారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలను కట్టబెట్టిన సంగతి తెలిసిందే.




More Telugu News