Amitabh Bachchan: కేబీసీ కారణంగా పెళ్లి చేసుకోలేదన్న కంటెస్టెంట్... ఆశ్చర్యపోయిన అమితాబ్ బచ్చన్
- కేబీసీ హాట్ సీట్ కోసం 25 ఏళ్లుగా పెళ్లి చేసుకోలేదన్న కంటెస్టెంట్
- మిత్ కుమార్ థక్రార్ మాటలకు ఆశ్చర్యపోయిన అమితాబ్ బచ్చన్
- ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్లయిపోయిందని వెల్లడి
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) షోలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. హాట్ సీట్‌పైకి వచ్చిన మిత్‌కుమార్ థక్రార్ అనే కంటెస్టెంట్.. తాను కేబీసీ కోసమే పెళ్లి చేసుకోలేదని చెప్పి అమితాబ్‌తో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆయన చెప్పిన మాటలు షోలో నవ్వులు పూయించాయి.
ఈ సందర్భంగా మిత్‌కుమార్ మాట్లాడుతూ, "నేను గత 25 ఏళ్లుగా కేబీసీలో కంటెస్టెంట్‌గా పాల్గొనాలని ప్రయత్నిస్తున్నాను. పాతికేళ్ల క్రితం నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అయితే, మొదట కేబీసీ హాట్ సీట్‌లో కూర్చుంటానని, ఆ తర్వాతే పెళ్లి గుర్రం ఎక్కుతానని ఆ అమ్మాయికి చెప్పాను" అని వివరించారు. దీనికి అమితాబ్ సరదాగా స్పందిస్తూ, "అంటే ఆ అమ్మాయి కూడా మీ కోసం 25 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉందా?" అని ప్రశ్నించారు.
అమితాబ్ ప్రశ్నకు మిత్‌కుమార్ బదులిస్తూ, "లేదు సర్, ఆమెకు ఎప్పుడో పెళ్లయిపోయింది" అని చెప్పడంతో బిగ్ బీతో పాటు ఆడియన్స్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటోందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
ఇటీవల, తన కొత్త సినిమా 'తూ మేరీ మేన్ తేరా' ప్రమోషన్ కోసం షోకు విచ్చేసిన నటి అనన్య పాండే కూడా కేబీసీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. "మా తాతయ్య, నానమ్మ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు మేమంతా కలిసి కేబీసీ చూస్తాం. మా కుటుంబంలో ఎవరో ఒకరు హాట్ సీట్‌పై కూర్చోవాలని కల కన్నాం. ఆ అదృష్టం నాకు దక్కింది" అని అనన్య తెలిపారు.