అదానీ, అంబానీల కోసమే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు: సీతక్క
- జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడంపై సీతక్క ఫైర్
- గాంధీ పేరు తీసేసి ఆయనను మరోసారి హత్య చేశారన్న సీతక్క
- పథకాన్ని కాపాడాలని అన్ని గ్రామాల్లో తీర్మానం చేస్తామని వెల్లడి
అదానీ, అంబానీల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని సీతక్క మండిపడ్డారు. ఈ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ నెల 27 లేదా 28 తేదీలో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు, వలసలను అరికట్టేందుకు గత యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే... ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీకి ఉరి వేసిందని దుయ్యబట్టారు.