పదవులు పొందిన జనసేన నేతలతో నేడు పవన్ భేటీ
- 3 వేల మందితో పదవీ - బాధ్యత పేరిట జనసేన సమావేశం
- నేతలకు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేస్తారన్న నాదెండ్ల మనోహర్
- టెలీ కాన్ఫరెన్స్ లో నేతలకు తెలియజేసిన నాదెండ్ల మనోహర్
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3 వేల మందితో సమావేశం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధినేత సోమవారం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. "పదవి - బాధ్యత" పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కార్యక్రమ వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ తరపున నిర్వహిస్తున్న "పదవి - బాధ్యత" కార్యక్రమం అత్యంత కీలకమైన సమావేశమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేయబోయే ప్రసంగం మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.