రాహుల్ గాంధీ విదేశీ పర్యటన.. దేశ వ్యతిరేకులతో భేటీ అయ్యారని బీజేపీ ఆగ్రహం
- భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారన్న బీజేపీ అధికార ప్రతినిధి
- జార్జ్ సోరోస్‌తో రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
- రాహుల్, సోరోస్ పేరుకే ఇధ్దరు వ్యక్తులని, ఆత్మ ఒక్కటేనని వ్యాఖ్య
జర్మనీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేకులతో సమావేశమయ్యారని బీజేపీ ఆరోపించింది. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ఆయన దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, అమెరికాకు చెందిన బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయని మరోసారి ఆరోపించారు. విదేశీ గడ్డపై దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులైనప్పటికీ వారి ఆత్మ ఒక్కటేనని విమర్శించారు.
జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ట్రస్టీతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనలు చేయడం కొత్తేమీ కాదని అన్నారు. భారత్ పట్ల ద్వేషం వెళ్లగక్కుతూ, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నే వ్యక్తులతో ఆయన సమావేశమవుతున్నారని విమర్శించారు.