Jagan Mohan Reddy: జగన్ బర్త్‌డే ఫ్లెక్సీలో కేసీఆర్, కేటీఆర్.. తాడేపల్లిలో వైరల్ అవుతున్న కటౌట్!

Jagan Birthday Flex featuring KCR and KTR goes viral in Tadepalli
  • రేపు వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు
  • సమరశంఖం పూరిస్తున్న జగన్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు
  • అధికారం పోయినప్పటికీ చెక్కుచెదరని స్నేహం
వైసీపీ అధినేత జగన్ రేపు పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసం ఉండే తాడేపల్లిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఓ కటౌట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ కటౌట్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కనిపించడమే దీనికి కారణం.

జగన్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జగన్ సమరశంఖం పూరిస్తుండగా, ఆయన వెనుక కేసీఆర్, కేటీఆర్ చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా ఉంది. ఈ అనూహ్యమైన కాంబినేషన్ చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

2019లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు వీరికి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి కావడంతో ఇరువురు నేతలు పలు సందర్భాల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరుకావడం, ఇటీవలే కేసీఆర్‌కు హిప్ సర్జరీ జరిగినప్పుడు జగన్ స్వయంగా హైదరాబాద్ వెళ్లి పరామర్శించడం వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది.
Jagan Mohan Reddy
YS Jagan
KCR
KTR
Telangana politics
Andhra Pradesh politics
Tadepalli
Birthday Flex
YSRCP
Political friendship

More Telugu News