Deepu Chandra Das: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య... ఏడుగురి అరెస్టు

Deepu Chandra Das Murder Seven Arrested in Bangladesh
  • హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ హత్య
  • స్పందించిన బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం
  • రాపిడ్ యాక్షన్ బెటాలియన్ అరెస్టు చేసిందన్న ప్రభుత్వం
బంగ్లాదేశ్‌లో 27 ఏళ్ల హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఆందోళనకారులు దీపూను తీవ్రంగా కొట్టి చంపిన నేపథ్యంలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తాయి. దీంతో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. తమ ప్రభుత్వ హయాంలో మూకదాడులకు చోటు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు పేర్కొన్నారు.

దీపూను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో జరుగుతున్న అల్లర్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ దర్యాప్తు చేస్తోందని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించి, మూక దాడులకు, హింసకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీపూ హంతకులను బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ అరెస్టు చేసింది.

అరెస్టైన వారిలో లిమోన్ సర్కార్, తారెక్ హొస్సేన్, మానిక్ మియా, ఇర్షాద్ అలీ, నిజుముద్దీన్, అలోమ్‌గిర్ హొస్సేన్, మీర్జా హొస్సేన్ అకోన్ ఉన్నారు. 

ఈ దుర్ఘటన మైమెన్‌సింగ్‌ జిల్లాలోని వాలుకా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడే దీపూ చంద్ర దాస్ హత్యకు గురయ్యాడు.
Deepu Chandra Das
Bangladesh
Hindu youth murder
Mymensingh district
Waluka
Rapid Action Battalion

More Telugu News