అమెరికా దాటి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ సూచన

  • తిరిగి రావడానికి ఏడాది దాకా పట్టొచ్చని హెచ్చరిక
  • వీసా స్టాంపింగ్ లో తీవ్ర ఆలస్యమవుతోందని ఉద్యోగులకు అంతర్గత మెమో
  • విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సలహా
టెక్ దిగ్గజం గూగుల్ తన విదేశీ ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ట్రంప్ వీసా ఆంక్షల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని చెప్పింది. అమెరికాలో హెచ్-1బి వంటి వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం అమెరికా వదిలి వెళ్లవద్దని సూచించింది. ఒకవేళ అత్యవసరమై విదేశాలకు వెళ్తే, తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉందని కంపెనీ హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ తన ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసినట్లు సమాచారం.

విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ ప్రక్రియలో 'తీవ్రమైన' జాప్యం జరుగుతోందని గూగుల్ పేర్కొంది. దీనివల్ల ఉద్యోగులు తమ స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలనుకుంటే భారీ ఆలస్యం తప్పదని తెలిపింది. ఈ హెచ్చరిక నేపథ్యంలో గూగుల్‌లో హెచ్-1బి వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఇండియాకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల మార్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News