బ్యాంకులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కీలక మార్పు

  • రిస్క్ ఆధారంగా ప్రీమియం వసూలుకు ఆర్‌బీఐ ఆమోదం
  •  ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు తగ్గనున్న భారం
  •  హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం
ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీ ఊరట కల్పించింది. డిపాజిట్ల బీమా కోసం చెల్లించే ప్రీమియం విధానంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు ఒకేలా ఉన్న ప్రీమియం విధానాన్ని సవరించి, ఇకపై బ్యాంకు నష్ట భయం (రిస్క్) ఆధారంగా ప్రీమియంను అమలు చేయనుంది.
 
ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంకులు తమ డిపాజిట్లలో ప్రతీ రూ.100కు 12 పైసల చొప్పున 'డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌' (డీఐసీజీసీ)కి ప్రీమియంగా చెల్లిస్తున్నాయి. అయితే, ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఈ ఫ్లాట్ విధానానికి తెరపడనుంది. బ్యాంకు ఆర్థిక పనితీరును బట్టి ప్రీమియం మొత్తం మారుతుంది. దీనివల్ల ఆర్థికంగా బలంగా, మెరుగైన పనితీరు కనబరిచే బ్యాంకులకు ప్రీమియం భారం గణనీయంగా తగ్గనుంది.
 
హైదరాబాద్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. ఈ భేటీలో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై కూడా చర్చించినట్లు సమాచారం. 


More Telugu News