పంట రుణం చెల్లించేందుకు రూ.2 లక్షలకు పైగా నకిలీ రూ.500 నోట్లు తెచ్చిన రైతు
- నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఘటన
- రుణం చెల్లించేందుకు తెచ్చిన రూ.2,08,500 నకిలీ నోట్లుగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది
- బ్యాంకు సిబ్బంది ప్రశ్నించడంతో పరారైన రైతు
క్యాష్ కౌంటర్ వద్ద నగదును అందించగా, కౌంటింగ్ యంత్రం ద్వారా లెక్కిస్తుండగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది మొత్తం నగదును పరిశీలించగా అన్నీ నకిలీ నోట్లుగా తేల్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావని బ్యాంకు సిబ్బంది రైతును ప్రశ్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
బ్యాంకు అధికారులు నాలుగు రూ.500 నోట్ల కట్టలలో ఒక్కొక్క కట్టపై ఒకే రకమైన సీరియల్ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారి పంకజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు.