ప్రభాస్ 'రాజా సాబ్' ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇదిగో!

  • ఒకరోజు ముందే థియేటర్లలోకి రానున్న 'ది రాజాసాబ్'
  • జనవరి 8న స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు నిర్మాత ప్రకటన
  • ఇటీవల విడుదలైన 'సహనా.. సహనా..' పాటకు మంచి స్పందన
  • త్వరలో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు చిత్ర బృందం శుభవార్తను అందించింది. ఆయన నటిస్తున్న నూతన చిత్రం 'ది రాజాసాబ్'ను అధికారిక విడుదల తేదీకి ఒకరోజు ముందే వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, జనవరి 8న ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రమోషన్లను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం 'సహనా.. సహనా..' అనే శ్రావ్యమైన పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రీమియర్ షోల గురించి తెలియజేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదివరకే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే హైదరాబాద్‌లోని ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. వరుస ప్రకటనలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 


More Telugu News