ఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సదస్సులో మోగిన ఫైర్ అలారం... బయటకు వెళ్లిన ప్రతినిధులు

  • సంప్రదాయ ఔషధంపై ఢిల్లీలోని భారత మండపంలో సదస్సు
  • ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురైన నిర్వాహకులు, ప్రతినిధులు
  • ప్రతినిధులను బయటకు పంపించిన నిర్వాహకులు
  • సాంకేతిక లోపం కారణంగా అలారం మోగినట్లు గుర్తింపు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ (సంప్రదాయ ఔషధంపై సదస్సు) రెండో ఎడిషన్ భారతదేశ రాజధాని ఢిల్లీలో నేటి నుండి ప్రారంభమైంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఫైర్ అలారం మోగడంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు.

ఏం జరిగిందో తెలియక అందరూ ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకులు వారందరినీ బయటకు పంపించారు. అయితే సాంకేతిక లోపం కారణంగా అలారం మోగినట్లు గుర్తించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, డబ్ల్యూహెచ్‌ఓ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారత మండపంలో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల నుంచి పరిశోధకులు, సంబంధిత రంగ నిపుణులు, చట్టసభ సభ్యులు సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. దాదాపు 170 మంది నిపుణులు పలు అంశాలపై మాట్లాడనున్నారు.


More Telugu News