కాళేశ్వరం మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారు ఘన విజయం
- సర్పంచ్‌గా గెలిచిన బీఆర్ఎస్ మద్దతిచ్చిన మోహన్ రెడ్డి
- వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో విజయం
- మండలంలో పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఘన విజయం
కాళేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి భారీ విజయాన్ని నమోదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలున్న నేపథ్యంలో, ఆ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే వాదనలు వినిపించాయి.
అయితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలం, కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహదేవ్‌పూర్ మండలంలో కాళేశ్వరంతో పాటు అన్నారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.