దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20లకు శుభ్‌మన్ గిల్ దూరం

  • ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ కాలి బొటన వేలికి గాయం
  • లక్నో, అహ్మదాబాద్ మ్యాచ్‌లకు గిల్ దూరం
  • మొదటి మూడు మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోయిన శుభ్‌మన్
దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్‌ల నుంచి భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైదొలిగాడు. ఐదు టీ20ల సిరీస్‌లో ఇదివరకే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో నాలుగు పరుగులు, రెండవ మ్యాచ్‌లో డకౌట్, మూడవ మ్యాచ్‌లో 28 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ క్రమంలో, నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ కాలి బొటన వేలికి గాయమైంది. ఈ కారణంగానే లక్నోలో జరిగే మ్యాచ్‌తో పాటు, అహ్మదాబాద్‌లో జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.


More Telugu News