షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • నేడు షర్మిల పుట్టినరోజు
  • సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు, పవన్
  • బహిరంగంగా శుభాకాంక్షలు తెలపని జగన్
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఈరోజు తన 51వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రాజకీయ పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా షర్మిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆమెకు చిరాయువు, సుఖ సంతోషాలు అందించాలని ఆకాంక్షించారు.

అయితే, షర్మిల సోదరుడు, వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆమెకు బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపలేదు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం మరోసారి వారి మధ్య దూరాన్ని స్పష్టం చేస్తోంది.


More Telugu News