హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకున్న రాష్ట్రపతి
  • స్వాగతం పలికిన గవర్నర్, మంత్రులు
  • ఈ నెల 22 వరకు హైదరాబాద్‌లో ఉండనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు.

ఆమె డిసెంబర్ 22 వరకు హైదరాబాద్‌లో ఉంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయి. రేపు రాష్ట్రపతి నిలయంలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు.

20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొంటారు. 21న రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.


More Telugu News