గుడివాడ ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం

  • విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం వినియోగించాలని సూచన
  • ఏఎన్నార్‌ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు
  • తన తండ్రి వేల మంది బంగారు భవిష్యత్తుకు కృషి చేశారని వ్యాఖ్య 
మనుషులు శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్‌ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోలేదని చెప్పారు. అయితే, తన తండ్రికి చదువు విలువ తెలుసని, ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు నివ్వాలని ఆయన తపనపడ్డారని తెలిపారు. 1959లోనే కళాశాలకు తన తండ్రి ఏఎన్నార్‌ రూ.లక్ష విరాళం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం తాను రూ.2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు నాగార్జున ప్రకటించారు.


More Telugu News