ఐబొమ్మ రవికి మరో 12 రోజుల పాటు పోలీసు కస్టడీ

  • మూడు కేసుల్లో 4 రోజుల చొప్పున విచారణ చేయాలన్న కోర్టు
  • ఈ నెల 18 నుంచి రవిని కస్టడీకి తీసుకోనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
  • రవిని మరోసారి కస్టడీకి తీసుకుంటేనే నెట్ వర్క్ బయటపడుతుందన్న పోలీసులు
పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మరోసారి పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో మూడు కేసుల్లో నాలుగు రోజుల చొప్పున 12 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

మరో మూడు కేసుల్లో ఐబొమ్మ రవిని విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున విచారించాలని కోర్టు ఆదేశించింది.

ఈరోజు జరిగిన విచారణలో రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ కోర్టులో వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకున్నారని తెలిపారు. మరోవైపు, రవిని కస్టడీకి తీసుకుని విచారిస్తేనే పూర్తి నెట్ వర్క్ బయటపడుతుందని సైబర్ క్రైమ్ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.


More Telugu News