నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు

  • రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
  • నా తండ్రికి అందరూ ఒకటేనన్న ఎస్పీ చరణ్
  • ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని వ్యాఖ్య
తన తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరియు బాలు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి ఆయన కతజ్ఞతలు తెలియజేశారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.


More Telugu News