హిమాలయాల్లో 60 ఏళ్లుగా అమెరికా అణుపరికరం... ఇప్పటికీ వీడని మిస్టరీ!
- చైనాపై గూఢచర్యానికి నందాదేవిపై అణు పరికరం ఏర్పాటుకు యత్నం
- భారీ మంచు తుపాను కారణంగా మిషన్‌ను మధ్యలోనే నిలిపివేసిన వైనం
- ప్లుటోనియం ఉన్న జనరేటర్‌ను పర్వతంపైనే వదిలేసిన పర్వతారోహకులు
ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయిలో ఉన్న సమయంలో 1965లో, చైనా అణుబాంబు పరీక్షలు నిర్వహిస్తున్న సమయమది. వారి క్షిపణి ప్రయోగాలపై గూఢచర్యం చేసేందుకు అమెరికా సీఐఏ, భారత ప్రభుత్వంతో కలిసి ఒక అత్యంత రహస్య మిషన్‌కు శ్రీకారం చుట్టింది. హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు ఇంధనంతో పనిచేసే ఒక యాంటెనాని అమర్చడమే ఆ మిషన్ లక్ష్యం. అయితే, ఆ మిషన్ ఘోరంగా విఫలమై, గంగానదికి ఇప్పటికీ ముప్పుగా పరిణమించే ఒక ప్రమాదకర పరికరాన్ని అక్కడే వదిలేయాల్సి వచ్చింది.
అమెరికన్, భారత పర్వతారోహకులతో కూడిన బృందం 13 కిలోల బరువున్న ప్లుటోనియం జనరేటర్ (SNAP-19C), యాంటెనా, కేబుళ్లతో నందాదేవి శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించింది. శిఖరానికి అత్యంత సమీపంలోకి చేరుకున్న సమయంలో, అకస్మాత్తుగా భయంకరమైన మంచు తుపాను వారిని చుట్టుముట్టింది. కింది బేస్ క్యాంప్ నుంచి మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లి, వారి ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించి, వెంటనే వెనక్కి తిరిగి రావాలని ఆదేశించారు. "పరికరాన్ని భద్రంగా అక్కడే దాచిపెట్టి, ప్రాణాలతో తిరిగి రండి" అని రేడియోలో సందేశం పంపారు.
ఆ బృందం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అణు పరికరాన్ని అక్కడే ఒక మంచు శిలపై వదిలేసి కిందకు దిగివచ్చింది. నాగసాకిపై వేసిన బాంబులోని ప్లుటోనియంలో దాదాపు మూడో వంతు ఆ పరికరంలో ఉంది. ఆ తర్వాత అది ఎప్పటికీ కనపడలేదు. మరుసటి ఏడాది వెళ్లి వెతికినా, భారీ హిమపాతం కారణంగా ఆ పరికరంతో పాటు అది ఉన్న మంచు శిల మొత్తం కొట్టుకుపోయింది.
ఈ రహస్య మిషన్ 1978లో ఒక పత్రికా కథనం ద్వారా బయటపడే వరకు ప్రపంచానికి తెలియదు. ఈ వార్తతో భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. గంగానది జలాలకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ రహస్యంగా చర్చించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
ఈ మిషన్‌లో పాల్గొన్న అమెరికన్ పర్వతారోహకుడు జిమ్ మెకార్తీ, ఇప్పటికీ ఆ తప్పును గుర్తుచేసుకుని ఆగ్రహంతో ఊగిపోతారు. "గంగానదికి జన్మనిచ్చే హిమానీనదం వద్ద ప్లుటోనియం వదిలేయడం క్షమించరాని నేరం. గంగపై ఎంతమంది ఆధారపడి ఉన్నారో తెలుసా?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే మరణించిన కెప్టెన్ కోహ్లి కూడా, "సీఐఏ ప్రణాళిక, వారి చర్యలు అన్నీ మూర్ఖమైనవి. అదంతా నా జీవితంలో ఒక చేదు అధ్యాయం" అని గతంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.