మెస్సీతో ఫుట్‌బాల్ ఆడిన రేవంత్ రెడ్డి మనవడు

  • సూచనలు చేస్తూ సరదాగా ఆడించిన రేవంత్ రెడ్డి
  • మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి భార్యను పలకరించిన రాహుల్ గాంధీ
  • గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. రేవంత్ రెడ్డి పక్కన నిలబడి సూచనలు చేస్తూ సరదాగా కాసేపు మనవడితో ఆడించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌కు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డిని రాహుల్ గాంధీ పలకరించారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మెస్సీకి తెలంగాణ స్వాగతం పలుకుతోందని అన్నారు. "నౌ తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్" అంటూ నినదించారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీతో ప్రత్యేక చార్టెడ్ విమానంలో ఢిల్లీ బయలుదేరారు.

గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మెస్సీ, రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున, మెస్సీ అపర్ణ మెస్సీ జట్టు తరఫున మైదానంలోకి దిగారు. మెస్సీ జట్టుపై 4-2 గోల్స్‌తో సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది.


More Telugu News