సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ టీమ్ తరఫున మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్

  • ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మెస్సీ
  • ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత
  • ఫోక్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న సిప్లిగంజ్, మంగ్లీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలో మెస్సీ మేనియా వెల్లివిరిసింది. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మెస్సీ అభిమానులు జెర్సీ నెంబర్ 10తో స్టేడియానికి తరలి వచ్చారు. స్టేడియం, పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి, మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ తరఫున, మెస్సీ అపర్ణ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు.

కోల్‌కతా ఘటనతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతకుముందు స్టేడియంలో మ్యూజికల్ నైట్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మంగ్లీ, సిప్లిగంజ్ తమ ఫోక్ సాంగ్స్‌తో అలరించారు.


More Telugu News