అఖండ-2 చిత్రానికి ప్రేక్షకాదరణ బాగానే ఉంది... కానీ చిత్ర పరిశ్రమలోనే నెగెటివిటీ ఉంది: నిర్మాత రామ్ ఆచంట

  • 'అఖండ 2'కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న నిర్మాత రామ్ ఆచంట
  • ఇండస్ట్రీలోనే సినిమాపై కొంత నెగెటివిటీ ఉందని వ్యాఖ్య
  • రివ్యూలపై ఎవరి అభిప్రాయం వారిదని వెల్లడి
'అఖండ 2' చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచే కొంత నెగెటివిటీ ఉందని నిర్మాత రామ్ ఆచంట అన్నారు. ఇటీవల నిర్వహించిన సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుందని, బుకింగ్స్ కూడా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రివ్యూల విషయంలో ఎవరినీ తప్పుపట్టలేమని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారని రామ్ ఆచంట అన్నారు. సినిమా ఫలితంపై బాలకృష్ణతో సహా చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అయితే, సినిమా విడుదల వారం రోజులు ఆలస్యం కావడం వల్ల ఓవర్సీస్‌లో ప్రదర్శించే థియేటర్ల సంఖ్య కొంత తగ్గిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో నిర్మాత గోపి ఆచంట, సినిమా విడుదల ఆలస్యం కావడం పట్ల బాలకృష్ణ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్లే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 


More Telugu News