Vahini: క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి వాహిని.. చికిత్సకు రూ. 35 లక్షలు అవసరం!
- ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స
- ఆర్థిక సాయం కోసం కరాటే కల్యాణి సోషల్ మీడియా పోస్ట్
- చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి
తెలుగు సినీ, సీరియల్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సహాయ నటి వాహిని (జయవాహిని) ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, వాహిని వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు.
కొన్ని నెలలుగా వాహిని రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వ్యాధి ముదిరిన దశకు చేరడంతో బహుళ అవయవాలు దెబ్బతిన్నాయని కల్యాణి తన పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స అందిస్తున్నారని, కీమోథెరపీ, ఆపరేషన్ వంటి వైద్య ప్రక్రియలకు సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తాన్ని ఆమె కుటుంబం భరించలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు పలు తెలుగు సినిమాలు, సీరియళ్లలో సహాయ నటిగా వాహిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సౌందర్య నటించిన 'శ్వేత నాగు' చిత్రంలో వాసుకి పాత్రతో పాటు అనేక సీరియళ్ల ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెరపై మనల్ని అలరించిన ఒక కళాకారిణి కష్టాల్లో ఉన్నారని, ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేయాలని కరాటే కల్యాణి విజ్ఞప్తి చేశారు.