Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027: తేదీలను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

Godavari Pushkaralu 2027 Dates Officially Announced by Government
  • 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7న ముగింపు
  • మొత్తం 12 రోజుల పాటు పుష్కర మహోత్సవాలు
  • టీటీడీ ఆస్థాన సిద్ధాంతి సిఫార్సు మేరకు ప్రభుత్వ నిర్ణయం
  • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
2027లో గోదావరి నది పుష్కరాల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న ప్రారంభమై 12 రోజులపాటు ఈ పుష్కరాలు కొనసాగి, జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది. టీటీడీ సిద్ధాంతి సిఫార్సులను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం వాటిని ఆమోదించి తుది నిర్ణయం తీసుకుంది.

ఈ తేదీలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రత్యేక నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లకు వీలుగా ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో పుష్కర పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులకు మార్గం సుగమమైంది. 
Godavari Pushkaralu
Godavari Pushkaralu 2027
Andhra Pradesh
Tirumala Tirupati Devasthanam
TTD
Tangirala Venkata Krishna Poorna Prasad
River Godavari
Hindu Festival

More Telugu News