DK Shivakumar: ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

DK Shivakumar to become Chief Minister after session says Congress MLA
శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని రామనగర కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇక్బాల్ హుస్సేన్ పేర్కొనడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ వ్యాఖ్యలు మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశానికి తెరలేపాయి.

"నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల అనంతరం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు" అని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్‌కు ఆ అవకాశం ఉందని, ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం శివకుమార్ చేసిన పోరాటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతాయని ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
DK Shivakumar
Siddaramaiah
Karnataka politics
Congress MLA Iqbal Hussain

More Telugu News