SP Balasubrahmanyam: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Unveil SP Balasubrahmanyam Statue at Ravindra Bharathi
  • బాలు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
  • రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 15న ఆవిష్కరణ
  • హాజరు కానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 15న జరగనుంది. 

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు.

రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలు విగ్రహం ఏర్పాటును కొందరు వ్యతిరేకించగా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యతిరేకతను తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
SP Balasubrahmanyam
Revanth Reddy
Ravindra Bharathi
SPB Statue

More Telugu News