Akhilesh Yadav: ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండేది కాదు: అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav BJP Would Not Be in Power Without AP Support
  • హైదరాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్
  • ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం
  • వచ్చే ఎన్నికల్లో యూపీలో జెండా పాతేస్తామని ధీమా
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్దతు లేకపోయి ఉంటే, కేంద్రంలో బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన సదర్ సమ్మేళనం ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ, "మనం వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, కానీ మనమంతా ఒక్కటే. ఇవాళ మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కలుసుకున్నాం" అని అన్నారు. భవిష్యత్తులో ఈ ఉత్సవాన్ని మరింత గొప్పగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని తాము వెనక్కి నెడుతున్నామని, రాబోయే ఎన్నికల్లో అక్కడ మళ్లీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నగర పర్యటనకు విచ్చేసిన అఖిలేశ్ యాదశ్, ఈ రాత్రికి తాజ్ కృష్ణా హోటల్‌లో బస చేయనున్నారు. శనివారం ఓ ప్రైవేటు సమావేశంలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు లక్నో తిరుగు ప్రయాణమవుతారు. అఖిలేశ్ పర్యటనకు నగరంలోని యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. 
Akhilesh Yadav
Samajwadi Party
BJP
Andhra Pradesh
Uttar Pradesh
Sadar Sammelan
Hyderabad
2024 Elections

More Telugu News