ఈ రోజు నా మనసును ఎంతగానో హత్తుకుంది: మంత్రి నారా లోకేశ్

  • విశాఖలో 20,000 సీట్ల సామర్థ్యంతో కాగ్నిజెంట్ క్యాంపస్
  • తక్షణమే 1,000 సీట్లతో టెక్ ఫిన్ సెంటర్ ప్రారంభం
  • ఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజింగ్ అంటున్న మంత్రి నారా లోకేశ్
  • గత 18 నెలల కృషి ఫలించిందని వ్యాఖ్య
  • ఇకపై ఏపీ ప్రగతి పైపైకేనని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి భారీ ఊపునిస్తూ, ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో భారీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. నగరంలో 20,000 సీట్ల సామర్థ్యంతో శాశ్వత క్యాంపస్‌కు భూమిపూజ చేయడంతో పాటు, తక్షణమే 1,000 సీట్లతో ఒక తాత్కాలిక టెక్ ఫిన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రగతిలో ఒక కొత్త అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తాజాగా దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

"ఈరోజు నాకు చాలా వ్యక్తిగతమైనది. గత 18 నెలలు అంత సులభంగా గడవలేదు... ప్రపంచ పెట్టుబడిదారులను ఒప్పించడం, నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడం, ఇటుక ఇటుక పేర్చి ఆంధ్రప్రదేశ్ కథను మళ్లీ చెప్పడం వంటివి ఎంతో శ్రమతో కూడుకున్నవి. విశాఖలో 20,000 సీట్ల సామర్థ్యంతో కాగ్నిజెంట్ తన క్యాంపస్‌కు భూమిపూజ చేయడం, 1,000 సీట్ల తాత్కాలిక టెక్‌ఫిన్ కేంద్రాన్ని ప్రారంభించడంతో మనం ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. మన యువ రాష్ట్ర ప్రయాణంలో ఇది ఒక సరికొత్త అధ్యాయం, ఒక కీలకమైన మలుపు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఒకేఒక్క మార్గం ఉంది... అది అభివృద్ధి పథమే" అని లోకేశ్ ఉద్ఘాటించారు. 


More Telugu News