ఆటగాళ్లతో కరచాలనం సందర్భంగా గౌతమ్ గంభీర్ ముఖంలో కోపం

  • దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి
  • భారత్ ఓటమిపై గౌతమ్ గంభీర్ అసహనం
  • కరచాలనంలో అర్ష్ దీప్ వంతు వచ్చినప్పుడు గంభీర్ ముఖంలో కోపం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమి పాలైన అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేస్తుండగా అర్ష్‌దీప్ సింగ్ వంతు వచ్చినప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో అసహనం వ్యక్తమైంది. ముల్లన్‌పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమి గంభీర్‌ను నిరాశకు గురిచేసింది.

మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఒక ఓవర్లో ఏడు వైడ్ బంతులు వేశాడు. ఆ సమయంలో కూడా గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓటమి తర్వాత కరచాలనం చేసే సమయంలో గంభీర్, అర్ష్‌దీప్‌తో పాటు జితేష్ శర్మ వంతు వచ్చినప్పుడు కూడా కోపంగా కనిపించాడు.

గౌతమ్ గంభీర్ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జట్టు, ఆటగాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మ్యాచ్ ఓడిపోయిన పరిస్థితుల్లో కోచ్‌లు వారికి అండగా నిలబడాలని సూచిస్తున్నారు. ఆటగాళ్లపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రవర్తిస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అంటున్నారు.


More Telugu News