‘ధురంధర్’ అద్భుతం.. రణ్‌వీర్ నటన హైలైట్: అల్లు అర్జున్

బాలీవుడ్ చిత్రం 'ధురంధర్'ను వీక్షించిన బ‌న్నీ
సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం
రణ్‌వీర్ సింగ్ నటన సినిమాకే హైలైట్ అని కితాబు
దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు చిత్ర బృందానికి అభినందనలు 
బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్' చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన, ఎక్స్ వేదికగా చిత్ర బృందాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అన్నారు.

"ఇప్పుడే ‘ధురంధర్’ సినిమా చూశాను. అత్యుత్తమ నటన, అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లతో కూడిన గొప్ప చిత్రం ఇది" అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "నా సోదరుడు రణ్‌వీర్ సింగ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు" అంటూ కితాబిచ్చారు.

అలాగే అక్షయ్ ఖన్నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలలో జీవించారని కొనియాడారు. హీరోయిన్ సారా అర్జున్ నటన కూడా ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను 'కెప్టెన్' అని సంబోధిస్తూ, ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా రూపొందించారని అభినందించారు. చిత్ర బృందం, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News