విశాఖకు ఐటీ కళ.. ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- విశాఖలో నాలుగు కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటు
- మొత్తం రూ. 282 కోట్లకు పైగా పెట్టుబడులు
- దాదాపు 4,300 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు
- టెక్ తమ్మిన, నాన్ రెల్, ఏసీఎన్, ఇమాజిన్నోవేట్ సంస్థల రాక
ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఒకేరోజు నాలుగు ప్రముఖ ఐటీ సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా నగరంలోకి రూ. 282.60 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
మంత్రి లోకేశ్ భూమిపూజ చేసిన సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి సమీపంలోని కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.140 కోట్ల పెట్టుబడితో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండగా, దీని ద్వారా అత్యధికంగా 2,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మధురవాడ ఐటీ హిల్-2లో టెక్ తమ్మిన సంస్థ రూ. 62 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా 500 మందికి, నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ. 50.60 కోట్ల పెట్టుబడితో 567 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఇదే ప్రాంతంలో ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ రూ. 30 కోట్ల పెట్టుబడితో మరో 600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సంస్థ 12 నెలల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.
ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఆయా కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు.