విమానం తోకకు చుట్టుకున్న పారాచూట్.. గాల్లో వేలాడిన స్కైడైవర్.. వీడియో ఇదిగో!
- విమానంలో నుంచి దూకుతుండగా తోకకు చుట్టుకున్న పారాచూట్
- పారాచూట్ తాళ్లను కోసేసి రెండో పారాచూట్ తో సేఫ్ గా దిగిన స్కైడైవర్
- ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో ఘటన
స్కైడైవింగ్ కోసం విమానంలో పైకి వెళ్లిన ఓ వ్యక్తి కొద్దిసేపు గాల్లోనే వేలాడాడు. స్కైడైవింగ్ చేస్తుండగా ఆయన పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
కొంతమంది ఔత్సాహిక స్కైడైవర్లు ఓ విమానంలో ఆకాశంలోకి వెళ్లి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో నుంచి కిందకి దూకుతున్నారు. ఈ క్రమంలో ఓ స్కైడైవర్ తొందరపడి పారాచూట్ బటన్ ను ముందే నొక్కాడు. దీంతో అతను విమానం అంచున ఉండగానే పారాచూట్ విచ్చుకుంది. గాలి వేగానికి అది విమానం తోకను చుట్టేసుకుంది. ఇంతలోనే ఆ స్కైడైవర్ విమానంలో నుంచి దూకేశాడు.
పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఆ స్కైడైవర్ గాల్లో వేలాడాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైనప్పటికీ వెంటనే సమయస్ఫూర్తితో తన వద్ద ఉన్న కత్తితో పారాచూట్ తాళ్లను కోసి విమానం నుంచి విడివడ్డాడు. స్కైడైవర్ల పారాచూట్ లలో అదనంగా ఉండే రిజర్వ్ పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పారాచూట్ కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.