అఖండ 2' నుంచి భావోద్వేగ గీతం... ఆకట్టుకుంటున్న 'ఓం శివ శివ' పాట

  • బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ-2: తాండవం
  • తల్లి-కొడుకు అనుబంధాన్ని ఆవిష్కరించిన ఈ పాట
  • తమన్ సంగీతం, కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం
  • పాటతో ఫ్యాన్స్‌లో మరింత పెరిగిన సినిమాపై అంచనాలు
  • డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో రేపు రాబోతున్న 'అఖండ 2' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, మేకర్స్ 'ఓం శివ శివ' అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ పాట శ్రోతలను, ముఖ్యంగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

"ప్రాణం పోసిన శంకరుడాడే చోట... కట్టిన పుణ్యం కట్టెలపాలుకు సిద్ధం చేసే ఆటేరా..." అంటూ కల్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం భావోద్వేగభరితంగా ఉంది. తల్లి-కొడుకుల మధ్య అనుబంధాన్ని, శివుడి తత్వాన్ని ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. తమన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోయగా, గాయకులు కనకవ్వ, శ్రుతి రంజనీల గాత్రం హృదయాలను హత్తుకుంటోంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో కూడా యాక్షన్, డ్రామా, భక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాట వీడియోకు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 'బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్' అంటూ కామెంట్లతో ట్రెండింగ్ చేస్తున్నారు.

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ఒక రోజు ముందుగా, ఈ రాత్రి (డిసెంబర్ 11) ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.


More Telugu News