Robin Uthappa: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గెలుపులో క్రెడిట్ ఇవ్వలేదు: గంభీర్‌పై రాబిన్ ఊతప్ప విమర్శలు

Robin Uthappa criticizes Gambhir for not giving credit to Rohit Sharma Virat Kohli
  • దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా విజయం
  • ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్, కోహ్లీ పేర్లను ప్రస్తావించలేదన్న రాబిన్ ఊతప్ప
  • వారికి క్రిడెట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడిన రాబిన్ ఊతప్ప
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేర్లను ప్రస్తావించకపోవడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప విమర్శించాడు. వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరూ శతకాలు, అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టీమిండియా వన్డే సిరీస్‌ను గెలవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ, టీమిండియా వన్డే సిరీస్ విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ వారిద్దరికీ తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం తాను గమనించానని అన్నాడు. రోహిత్, కోహ్లీ ద్వయం తమ ఫామ్‌పై వస్తున్న సందేహాలకు తమ ప్రదర్శనతో సమాధానం చెప్పారని పేర్కొన్నాడు. 

వారిద్దరూ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారని, తాము ఫామ్‌లో ఉంటే జట్టు కోసం ఏం చేయగలమో చేసి చూపించారని రాబిన్ ఊతప్ప అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Robin Uthappa
Gautam Gambhir
Rohit Sharma
Virat Kohli
India vs South Africa
ODI Series

More Telugu News