Telangana Panchayat Elections: ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Telangana Panchayat Elections First Phase Ends Peacefully
  • మధ్యాహ్నం 1 గంటతో ముగిసిన ఓటింగ్ ప్రక్రియ
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • రాత్రికే ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, పలుచోట్ల 1 గంట సమయానికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. రాత్రికి ఫలితాలు వెల్లడించి, ఉప సర్పంచ్‌ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నారు.

చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ చాలావరకు శాంతియుతంగా జరిగిందని అధికారులు తెలిపారు. కలెక్టర్లు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు.

మొదటి విడతలో భాగంగా మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, వాటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 12,960 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం మొత్తం 93,905 మంది సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వీరితో పాటు 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొన్నారు. పారదర్శకత కోసం 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
Telangana Panchayat Elections
TG Panchayat Elections
Local Body Elections
Village Elections
Election Results
Polling Updates
Webcasting
Rural Elections

More Telugu News