DSP: వ్యాపారికి మహిళా డీఎస్పీ లవ్ ట్రాప్.. నాలుగేళ్లలో రూ.2 కోట్లకు పైగా వసూలు

Hotel owner accuses DSP Kalpana Varma of blackmail and extortion
  • ఖరీదైన బహుమతులు ఇచ్చానని వాపోయిన హోటల్ యజమాని
  • తన హోటళ్లలో ఒకదానిని ఆమెకు రాసిచ్చినట్లు ఆరోపణ
  • ఇకపై డబ్బు ఇవ్వలేనని చెబితే బ్లాక్ మెయిల్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా వర్మపై రాయ్ పూర్ కు చెందిన హోటల్ యజమాని దీపక్ టాండన్ సంచలన ఆరోపణలు చేశారు. కల్పన తనను ప్రేమిస్తున్నానని చెప్పి నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉందని చెప్పారు. ఆమె డిమాండ్లు తీర్చేందుకు తాను రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశానని, ఇకపై తాను డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ప్రస్తుతం తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు.

డీఎస్పీ కల్పన తనతో జరిపిన వాట్సాప్ చాట్, వివిధ ప్రాంతాల్లో తామిద్దరమూ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా చూపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను డీఎస్పీ కల్పనా వర్మ కొట్టిపారేశారు. తనను అప్రతిష్ఠపాలు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఆమె ఆరోపించారు. దీపక్ టాండన్ ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్ గఢ్ లో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..
 
రాయ్ పూర్ కు చెందిన హోటల్ యజమాని దీపక్ టాండన్ కు 2021 లో దంతెవాడ డీఎస్పీ కల్పనా వర్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పెరిగి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నట్లు దీపక్ చెప్పారు. ఈ క్రమంలో కల్పన డిమాండ్‌ మేరకు ఖరీదైన బహుమతులు, డబ్బు ఇచ్చినట్లు చెప్పారు. డైమండ్ రింగ్, గోల్డ్ నెక్లెస్, బ్రాస్ లెట్, ఇన్నోవా కారు ఇచ్చినట్లు చెప్పారు. రాయ్‌పూర్‌లోని వీఐపీ రోడ్‌లో తన పేరు మీద ఉన్న హోటల్‌ను ఆమె సోదరుడి పేరు మీదకు మార్పించిందని తెలిపారు.

ఆ తర్వాత దాన్ని ఆమె పేరు మీదకు మార్చుకుందని ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. తనకు పెళ్లైందనే విషయం కూడా కల్పనకు తెలుసని, ఆమె పేరు బయటకు రాకుండా తనను విడాకులు తీసుకొమ్మని చెప్పిందన్నారు. అయితే, ఇటీవల తాను ఇకపై డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో డీఎస్పీ కల్పన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు గురిచేస్తోందని, తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని దీపక్ టాండన్ ఆరోపించారు.
DSP
love trap
hotel owner
extortion
Dantewada
Kalpana Varma
Deepak Tandon
Chhattisgarh
police investigation
Raipur

More Telugu News