Revanth Reddy: సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలకు కలిసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy meets Sonia Rahul and Priyanka Gandhi
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
  • గ్లోబల్ సమ్మిట్ విజయంపై వివరించిన రేవంత్
  • రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పనితీరుపై అధిష్ఠానానికి వివరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఈ ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అధిష్ఠానంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పాలన తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. ముఖ్యంగా, ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ఘన విజయం సాధించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయని ఆయన తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే వివిధ రంగాల్లో కలిపి రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
Revanth Reddy
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
Telangana Politics
Telangana Government
Telangana Rising Global Summit
Hyderabad Investments
Congress Party
Telangana Development

More Telugu News