: గోవా నైట్ క్లబ్ యజమానులు థాయ్ లాండ్ లో అరెస్ట్
- నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం తర్వాత థాయ్ లాండ్ కు పరారైన లూథ్రా బ్రదర్స్
- బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
- భారత ప్రభుత్వ విజ్ఞప్తితో లూథ్రా బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన థాయ్ పోలీసులు
గోవాలోని నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా థాయ్ లాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
అయితే, లూథ్రా బ్రదర్స్ పరారీలో ఉండడంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. థాయ్ లాండ్ కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పుకెట్ లో దాక్కున్న లూథ్రా బ్రదర్స్ ను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి చేతికి సంకెళ్లు వేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే వారిని భారత్ కు పంపించనున్నట్లు థాయ్ లాండ్ పోలీసులు తెలిపారు.
మేం పారిపోలేదు..
అగ్ని ప్రమాదం తర్వాత థాయ్ లాండ్ పారిపోయిన లూథ్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో తాము ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయ్ లాండ్ వచ్చామని అందులో పేర్కొన్నారు. క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యజమానులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్ లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, తమకు నాలుగు వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.