రాష్ట్రంలో హత్యలు మళ్లీ మొదలయ్యాయి: జగదీశ్ రెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు ప్రారంభమయ్యాయన్న జగదీశ్ రెడ్డి
- సూర్యాపేటలో హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పరామర్శ
- మల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మళ్లీ హత్యల సంస్కృతి మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు. సూర్యాపేటలో హత్యకు గురైన మల్లయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆరు నెలల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో ఓ హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంపై తాను అప్పుడే హెచ్చరించానని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. అయినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం వల్లే ఇప్పుడు మరో హత్య జరిగిందని విమర్శించారు. గతంలో ఈ గడ్డపై కాంగ్రెస్ నేతలు హత్యలు చేసేవారని, తాము పదేళ్ల పాలనలో ఆ సంస్కృతిని రూపుమాపితే, కాంగ్రెస్ మళ్లీ దానిని తిరిగి తీసుకొచ్చిందని ఆరోపించారు.
హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ రావాలనుకున్నారని, అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని తామే కోరినట్లు తెలిపారు.