Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై అంబటి రాయుడు, పీవీ సింధు ప్రశంసలు

Revanth Reddy Praised by Ambati Rayudu PV Sindhu
  • ముఖ్యమంత్రి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న రాయుడు
  • క్రీడల కోసం ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడానికి సదస్సు ఉపయోగపడుతుందని వ్యాఖ్య
  • క్రీడా రంగ అభివృద్ధికి సదస్సు ఉపయోగపడుతుందన్న పీవీ సింధు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'పై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పందించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నాడు. రాష్ట్రంలో క్రీడల కోసం ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ క్రీడా రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొంది. రాష్ట్రంలో అత్యాధునిక స్టేడియాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త క్రీడాకారులు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించి, తెలంగాణ రాష్ట్రం, భారతదేశ ఘనతను ప్రపంచానికి చాటి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
Revanth Reddy
Telangana Rising Global Summit 2025
Ambati Rayudu
PV Sindhu

More Telugu News