Suryakumar Yadav: మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్... పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు

Suryakumar Yadav Visits Puri Jagannath Temple Before T20 Match
  • దర్శించుకున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా
  • భార్య దేవీశా శెట్టితో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న సూర్యకుమార్
  • 'జైజగన్నాథ్' అంటూ భక్తులను పలకరించిన సూర్యకుమార్
ఒడిశాలోని కటక్‌లో గల బారాబతి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ మ్యాచ్‌ జరగడానికి కొన్ని గంటల ముందు భారత జట్టు పూరీలోని జగన్నాథుడిని దర్శించుకుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీశా శెట్టితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆటగాళ్లు ఆలయంలోకి ప్రవేశించారు. సూర్యకుమార్ యాదవ్ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను 'జై జగన్నాథ్' అంటూ పలకరించారు. కాగా, బారాబతి స్టేడియంలో నేడు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
Suryakumar Yadav
Suryakumar Yadav Puri
India vs South Africa
T20 Match
Puri Jagannath Temple

More Telugu News