Hardik Pandya: ఆ యాంగిల్‌లో ఫొటోలు తీస్తారా?.. చౌకబారు సంచలనం కోసం ఇంత దిగజారాలా?: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Slams Paparazzi for Inappropriate Photos of Maheeka Sharma
  • మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హార్దిక్ పాండ్యా
  • గర్ల్‌ఫ్రెండ్ మహీకాను అవమానకరంగా ఫొటోలు తీయడంపై ఫైర్
  • మహిళల గౌరవానికి భంగం కలిగించవద్దని మీడియాకు విజ్ఞప్తి
  • సెలబ్రిటీ జీవితంలో ఇది భాగమే అయినా హద్దులు దాటొద్దని హితవు
  • చౌకబారు సంచలనాల కోసం దిగజారొద్దంటూ ఆవేదన
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ మహీకా శర్మ ఫొటోలు తీసే క్రమంలో మీడియా ప్రతినిధులు హద్దులు మీరారని మండిపడ్డాడు. ఓ ఏకాంత క్షణాన్ని చౌకబారు సంచలనం కోసం వాడుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ ఘాటైన ప్రకటన విడుదల చేశాడు.

"ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీడియా దృష్టి, విమర్శలు సహజమే. నేను ఎంచుకున్న జీవితంలో ఇది ఒక భాగం అని నాకు తెలుసు. కానీ, ఈరోజు జరిగిన ఓ సంఘటన హద్దులు దాటింది" అని హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు. "బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో మహీకా మెట్లు దిగి వస్తుండగా, ఏ మహిళనూ చిత్రీకరించకూడని కోణంలో ఓ మీడియా ప్రతినిధి ఫొటోలు తీశాడు. ఒక ప్రైవేట్ సందర్భాన్ని చౌకబారు సంచలనంగా మార్చారు" అని హార్దిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రతిరోజూ కష్టపడి పనిచేసే మీడియా సోదరులంటే తనకు గౌరవం ఉందని, తాను ఎప్పుడూ సహకరిస్తానని హార్దిక్ తెలిపాడు. "ఇది హెడ్‌లైన్స్ గురించి కాదు. కనీస గౌరవం గురించి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ కొన్ని హద్దులు ఉంటాయి. దయచేసి కాస్త మానవత్వంతో ఆలోచించండి. ప్రతీది కెమెరాలో బంధించాల్సిన అవసరం లేదు" అని పాండ్యా మీడియాకు విజ్ఞప్తి చేశాడు.

మోడల్, యోగా ట్రైనర్ అయిన మహీకా శర్మతో తన రిలేష‌న్‌ను హార్దిక్ పాండ్యా ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. అక్టోబర్‌లో తన 32వ పుట్టినరోజుకు ముందు వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. అయితే, ఆమె చేతికి ఉన్న ఉంగరం చూసి నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలను మహీకా తోసిపుచ్చారు.
Hardik Pandya
Maheeka Sharma
Hardik Pandya girlfriend
Bollywood Paparazzi
Indian Cricket
Celebrity News
Social Media
Privacy
Mumbai
Instagram

More Telugu News