Akhanda 2: 'అఖండ-2' వివాదానికి శుభం కార్డు.. ఈ నెల 12న విడుదల!
- కొలిక్కి వచ్చిన అఖండ-2 విడుదల వివాదం
- నిర్మాణ సంస్థల మధ్య సానుకూలంగా ముగిసిన చర్చలు
- ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం
- మద్రాస్ హైకోర్టు అనుమతి తర్వాత అధికారిక ప్రకటన
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ-2: తాండవం' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. నిర్మాణ సంస్థల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ నెల 5న నిలిచిపోయిన ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
14 రీల్స్, ఈరోస్ సంస్థల మధ్య వున్న ఆర్ధిక వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం రాత్రి ఈ రెండు సంస్థల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రావడంతో వివాదం ముగిసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టుకు నివేదించి, సినిమా విడుదలకు అధికారిక అనుమతులు తీసుకోనున్నారు.
వివాదం సద్దుమణగడంతో 'అఖండ-2' చిత్రాన్ని ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు ముందుగా అంటే ఈ నెల 11న ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం కూడా ఉందని సమాచారం. న్యాయస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే సినిమా ప్రమోషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.