TTD Kalthe Neiyyi: టీటీడీ కల్తీ నెయ్యి కేసు: నేడు సిట్ కస్టడీకి ఇద్దరు నిందితులు

TTD Adulterated Ghee Case Two Accused to CBI Custody Today
  • ఇద్దరు ప్రధాన నిందితులకు నాలుగు రోజుల కస్టడీ 
  • అనుమతినిచ్చిన నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు
  • నిందితులను తిరుపతికి తరలించి విచారించనున్న అధికారులు
తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు ప్రధాన నిందితులను నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.
 
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్‌గా (జీఎం) పనిచేసిన సుబ్రహ్మణ్యం, నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రోజు (మంగళవారం) వీరిద్దరినీ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతికి తరలించి విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు వీరి కస్టడీ అవసరమని సిట్ వాదించింది.
 
నిందితుల కస్టడీ పిటిషన్లపై ఈ నెల 3న విచారణ జరిపిన ఏసీబీ కోర్టు, తీర్పును రిజర్వు చేసింది. తాజాగా నిన్న కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగు రోజుల విచారణలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
TTD Kalthe Neiyyi
TTD
Tirumala
Subramanyam
Ajay Sugandhi
Bhole Baba Dairy
Nellore ACB Court
CBI Investigation
Adulterated Ghee Case
Andhra Pradesh

More Telugu News