సీఎం సీటుకు రూ.500 కోట్లు వ్యాఖ్య: కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధూ భార్య సస్పెన్షన్
- ప్రాథమిక సభ్యత్వం తక్షణమే రద్దు
- ప్రకటించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్
- రూ.500 కోట్లు ఇస్తేనే ముఖ్యమంత్రి పీఠం అని సంచలన ఆరోపణలు చేసిన కౌర్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీలో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని నవజ్యోత్ కౌర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాణా ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం సరైనదేనని, ఆధారాలు లేకుండా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా అన్నారు. పార్టీ పట్ల ఆమె ఆరోపణలు ఏమాత్రం సహించరానివని అన్నారు.
శనివారం నవజ్యోత్ కౌర్ మాట్లాడుతూ, తన భర్త సిద్ధూ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ బేషరతుగా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తాము ఎప్పుడూ పంజాబ్ ప్రయోజనాల కోసమే పోరాడతామని అన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవని అన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అదేం లేదని చెప్పిన నవజ్యోత్ కౌర్, రూ.500 కోట్లు ఇచ్చిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు.