భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇవ్వాలి: చైనాకు భారత విదేశాంగ శాఖ గట్టి సందేశం
- చైనాకు, లేదా ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించే భారతీయులకు సూచనలు
- బీజింగ్ కూడా భారత ప్రయాణికుల విషయంలో సక్రమంగా వ్యవహరించాలని సందేశం
- ఏకపక్షంగా నిర్బంధించడం, వేధించడం చేయవద్దన్న విదేశాంగ శాఖ
అరుణాచల్ ప్రదేశ్ అంశంపై చైనాలోని షాంఘై విమానాశ్రయంలో ఒక భారతీయ మహిళకు వేధింపులు ఎదురైన నేపథ్యంలో, చైనాకు ప్రయాణిస్తున్న లేదా ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించే సమయంలో భారత పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచనలు జారీ చేసింది. అదే సమయంలో బీజింగ్ కూడా భారత ప్రయాణికుల విషయంలో సక్రమంగా వ్యవహరించాలని పేర్కొంది.
చైనా విమానాశ్రయాల మీదుగా రాకపోకలు సాగించే భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకపక్షంగా నిర్బంధించడం, వేధించడం వంటి పనులను మానుకుంటుందని, అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనలను గౌరవిస్తుందని భావిస్తున్నామని తెలిపింది. చైనా ప్రయాణాల విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.