తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ట్రంప్ మీడియా టెక్నాలజీస్ భారీ పెట్టుబడులు

  • తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి
  • పెట్టుబడులు పెడతామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ వెల్లడి
  • పదేళ్లలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు 
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

'ఫ్యూచర్ సిటీ'కి సీఐఐ మాజీ చైర్మన్ కితాబు

ఫ్యూచర్ సిటీ పేరుతో తెలంగాణలో కొత్త నగరం ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను ఒకే వేదికపైకి రప్పించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ విజన్‌లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో తాము ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామని అదానీ గ్రూప్ తెలిపింది. గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నామని, డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేశామని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా యూఏవీ సాంకేతికతను హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ తయారయ్యే యూఏవీలను సైన్యానికి అందిస్తామని, ప్రపంచ మార్కెట్‌లో కూడా విక్రయిస్తామని ఆయన అన్నారు.


More Telugu News